పనిచేయని ఏటీఎం కార్డులు.. పండగ ముందు ఆందోళన!

0
153

chip less atm cards are not working

నూతన సంవత్సరం ఆరంభంలోనే బ్యాంకు ఖాతాదార్లకు కొత్త సమస్య వచ్చిపడింది… ఏటీఎం కార్డులలో ఎలక్ర్టానిక్‌ చిప్‌ లేనివి నిరుపయోగంగా మారాయి. హైసెక్యూకరిటీ కల్పించాలనే దృష్టితో రిజర్వ్‌ బ్యాంకు చిప్‌లేని ఏటీఎం కార్డులను మార్చుకోవాలని గత మూడు నెలలుగా చెబుతూ వస్తోంది. జనవరి 1వ తేదీ నుంచి చిప్‌ లేని ఏటీఎం కార్డులు పనిచేయవని రిజర్వ్‌బ్యాంకు పేర్కొంది. రిజర్వ్‌ బ్యాంక్‌ చెప్పినట్లుగానే చిప్‌లేని ఏటీఎం కార్డులు నిరుపయోగంగా మారాయి. కార్డులు మార్చుకోవడానికి ఉద్యోగులు, అవగాహన ఉన్న ఖాతాదార్లు వేగంగానే స్పందించినప్పటికీ, అంతగా అవగాహన లేని ఖాతాదార్లు కార్డుల మార్పిడిలో అశ్రద్ధ చేసి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు.

భద్రత కోసమే
చిప్‌ బేస్డ్‌ ఏటీఎం కార్డులు కలిగి ఉంటే హైసెక్యూరిటీ లభించడమే కాకుండా కార్డులను పోలిన నకిలీ కార్డులు తయారు చేయడం, పాస్‌ వర్డ్‌ ఆధారంగా ఒకరి కార్డును వినియోగించి మరొకరు ఏటీఎం మిషన్‌ నుంచి సొమ్ము విత్‌డ్రా చేసే అవకాశాలు తగ్గుతాయి. ఈ కారణంగా రిజర్వ్‌ బ్యాంకు సూచనల మేరకు వాణిజ్య బ్యాంకులు చిప్‌లేని ఏటీఎం కార్డుల స్థానంలో ఎలక్ట్రానిక్ చిప్‌ కలిగిన ఏటిఎం కార్డులను అందజేస్తున్నాయి.

ఖాతాదారుల్లో ఆందోళన
కార్డులు లేని ఖాతాదార్లు ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణకు అవకాశం లేనందున ఫోన్‌పే, గూగుల్‌ పే, నెట్‌బ్యాంకింగ్‌ తదితర పద్ధతులను వినియోగించుకోవాలని బ్యాంకింగ్‌ వర్గాలు సూచిస్తున్నాయి. వాస్తవానికి జిల్లాలోని ఏటీఎంలలో 50 శాతం మూతపడి ఉండటం, నగదు లేకుండా ఉండటం జరుగుతోంది. ఈ ఇబ్బందులు చాలవన్నట్లు ఇప్పుడు తాజాగా చిప్‌లేని ఏటీఎం కార్డులు పనిచేయవని తెలియడంతో పలువురు ఖాతాదార్లు ఆందోళన చెందుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here