జగన్ లో ఇప్పుడు అందరికీ నచ్చిన ఒక కోణం..

0
288
One thing about AP CM Jagan That everyone is Liking Latest News in Telugu
One thing about AP CM Jagan That everyone is Liking Latest News in Telugu

వినేవాడు ఉంటే చెప్పేటోడు చెల‌రేగిపోతార‌ని చెబుతుంటారు. తాను ఏం చెప్పినా.. ఎంత చెప్పినా.. ఓపిగ్గా వేనేందుకు సిద్ధంగా ఉన్నా.. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తూ త‌న‌దైన మార్క్ వేస్తున్నారు ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. సీఎం ప‌ద‌విని చేప‌ట్టిన నాటి నుంచి వేదిక ఏదైనా.. స‌భ ఏదైనా.. స‌మావేశం ఏదైనా స‌రే.. సుత్తి లేకుండా సూటిగా విష‌యాన్ని చెప్ప‌టం.. వీలైనంత త‌క్కువ‌గా మాట్లాడుతున్న జ‌గ‌న్ గుణం అంద‌రిని ఆక‌ర్షిస్తోంది.

గ‌త ముఖ్య‌మంత్రికి భిన్నంగా జ‌గ‌న్ మాత్రం క్లుప్తంగా మాట్లాడుతున్నారంట. ఎక్క‌డిదాకానో ఎందుకు తాజాగా శాసన‌స‌భాప‌క్ష స‌మావేశం జ‌రిగింది. దీనికి జ‌గ‌న్ పార్టీ ఎమ్మెల్యేలంతా హాజ‌ర‌య్యారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న గంట మాట్లాడినా అడిగే వారు ఉండ‌రు స‌రి క‌దా.. ఆస‌క్తిగా వింటారు. ఇలాంటి వేదిక మీద కూడా జ‌గ‌న్ మాట్లాడింది కేవ‌లం 12 నిమిషాలే.

త‌క్కువ‌గా మాట్లాడ‌టం.. ఎక్కువ‌గా వింటున్న జ‌గ‌న్‌.. త‌న స‌మావేశాల్ని వీలైనంత త‌క్కువ వ్య‌వ‌ధిలో ముగిస్తున్నారు. దీంతో.. ఆయ‌న ఎక్కువ‌మందితో మాట్లాడ‌టంతో పాటు.. చ‌క‌చ‌కా నిర్ణ‌యాలు తీసుకుంటున్న ప‌రిస్థితి. గ‌త సీఎం చంద్ర‌బాబుకు భిన్నంగా ఆయ‌న చాలా త‌క్కువ స‌మ‌యంలోనే త‌న స్పీచుల్ని ముగించేస్తూ ఇప్పుడు అంద‌రిని ఆకర్శిస్తున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here